రెండో టీ20 : భారత్ విజయం, అలవోకగా చేదించిన కివీస్ విజయ లక్ష్యం

SMTV Desk 2019-02-08 15:04:53  India VS Newzeland, T20, BCCI, 2nd T20

ఆక్లాండ్, ఫిబ్రవరి 08: నేడు భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టీ20 ఆక్లాండ్ వేదికగా ఈడెన్ పార్క్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ బ్యాటింగ్ ఎంచుకొని తొలి ఇన్నింగ్స్ పూర్తయ్యేసరికి భారత్ కు న్యూజిలాండ్ 159 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇక అతి స్వల్ప విజయ లక్ష్యంతో క్రీజులోకి అడుగుపెట్టిన రోహిత్ సేన 162 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఈ విజయంతో టీ20 సిరీస్ ను చేజిక్కిచ్చుకోవడంలో ఇరు జట్ల వారు హోరాహోరీగా తలపడుతున్నారు. బుదవారం జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో కివీస్ టీం ఇండియా పై విజయం సాధించిన కివీస్ రెండో మ్యాచ్ లో పరాజయ పాలవ్వడంతో భారత్ 1-1 సీరిస్ సమం చేసింది. ఇక మూడో టీ20 ఆదివారం జరగనుంది.

భారత్ తుది జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, రిషబ్ పంత్, విజయ్ శంకర్, దినేశ్ కార్తీక్, మహేంద్రసింగ్ ధోని ( వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, చాహల్, ఖలీల్ అహ్మద్.