విజయవాడ-గుంటూరు కొత్త రైల్వేలైనుకు కేంద్రం అడ్డుకట్ట

SMTV Desk 2019-02-08 14:05:29  Vijayawada, Guntur, New Railway Lines, Budget Meeting, NITI Ayog, Kanakamedala Ravindra Kumar, Piyush Goyal

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 08: విజయవాడ-గుంటూరు కొత్త రైల్వేలైనుకు కేంద్రం అడ్డుకట్ట వేసింది. 2017-18 ఆర్థిక సంవత్సరం కేంద్ర వార్షిక బడ్జెట్‌లో ప్రతిపాదించిన ఈ బిల్లుకు రెడ్‌ సిగ్నల్‌ వేసింది. ఈరైల్వే లైనును ప్రతిపాదించి దాదాపు ఏడాది గడిచిపోయింది. ఇప్పటి వరకు దీని పట్ల స్పందించని కేంద్రం ఎట్టకేలకు బడ్జెట్‌ సమావేశాల్లో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నకు సమాధానంగా సాధ్యం కాదని చెప్పేసింది.

ఆంధ్రప్రదేశ్ నూతన రాజాధాని అమరావతిని అనుసంధానిస్తూ ఈ రైల్వేలైనుకు గతంలో ప్రతిపాదించారు. నీతి అయోగ్‌ సిఫార్సు అంటూ ప్రతిపాదించిన పనులను ఆమోదించేందుకు తిరస్కరిస్తుంది. ఉపరితల రవాణాశాఖ, పట్టణాభివృద్ధి శాఖ మధ్య సంప్రదింపుల ప్రక్రియ ఇంకా పూర్తికానందున ఈ ప్రతిపాదన ముందుకు సాగే అవకాశం ఇప్పట్లో లేదని మంత్రి పీయూష్‌ గోయల్‌ స్పష్టం చేశారు.