ఇప్పుడు రాజకీయాలపై ఆసక్తి లేదు

SMTV Desk 2019-02-08 13:17:54  Justice Kuriyan, Supreme Court, Kerala, Judge

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 08: సుప్రీమ్ కోర్ట్ మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ కురియన్‌ జోసఫ్‌ కొన్ని రాజకీయ పార్టీు తమ తరపున ఎన్నిక బరిలో నిలవాలని కోరిన మాట వాస్తవం. అయితే నాకు ఆసక్తి లేదని అప్పుడే చెప్పేశాను అని స్పష్టం చేశారు. సుప్రీమ్ కోర్ట్ న్యాయస్థానం పాలనా వ్యవస్థను విమర్శిస్తూ 2018 జనవరిలో నలుగురు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు తొలిసారి మీడియా ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

ఆ నలుగురిలో ఒకరే జస్టిస్‌ కురియన్‌. రానున్న లోక్ సభ ఎన్నికలలో తాను పోటీ చేస్తున్నాడన్న పుకార్లను తిప్పికొట్టారు. కేరళలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌, సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్‌ పార్టీలకు చెందిన కొందరు నేతలు తనను అనధికారికంగా కలిసి పోటీ చేయాలని అడిగినప్పుడే తనకు ఆసక్తి లేదని చెప్పానని తెలిపారు. విద్యార్థి దశలో ఉండగా రాజకీయాలపై ఆసక్తి ఉన్న మాట వాస్తవమే అయినా ఆ తర్వాత పూర్తిగా న్యాయవృత్తికే తాను పరిమితమయ్యానని పేర్కొన్నారు.

2000 లో కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ కురియన్‌ నియమితులయ్యారు. పదోన్నతిపై 2013లో సర్వోన్నత న్యాయస్థానం కు వెళ్లారు. కురియన్‌ గత ఏడాది నవంబర్‌లో పదవీ విరమణ చేశారు.