మా ఎమ్మెల్యేలు కనిపించడం లేదు: కుమారస్వామి

SMTV Desk 2019-02-08 12:20:23  Karnataka, Assembly meeting, Kumara Swamy, Congress, BJP

కర్ణాటక, ఫిబ్రవరి 08: కర్ణాటక బడ్జెట్ సమావేశాలకు ఎమ్మెల్యేల గైర్హాజరుపై కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఆవేదన వ్యక్తం చేసారు. గత వారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన శాసనసభ సమావేశానికి నలుగురు ఎమ్మెల్యేలు డుమ్మా కోట్టారు. వ్యక్తిగత పనుల వల్ల రాలేదని సిద్దరామయ్య ప్రకటించారు. గురువారం ఏకంగా 20మంది సభ్యులు అసెంబ్లీకి రాకపోవడంతో ప్రభుత్వ పెద్దల్లో టెన్షన్ పెరుగుతోంది.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కుమారస్వామి ఆరోపించారు. బెంగళూరులో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో కుమారస్వామి మాట్లాడుతూ ఇప్పటికే ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కనబడటం లేదని అన్నారు. బీజేపి నేతలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి వారిని తమ పార్టీలోకి రప్పించుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు.

అంతేకాకుండా కాంగ్రెస్ నేతలను ప్రలోభాలకు గురిచేస్తూ బీజేపీ నేతలు చేసిన ఫోన్ కాల్స్ రికార్డింగ్స్ ను కూడా మీడియా ముందు ప్రదర్శించారు. తాను చేసిన ఆరోపణలు అన్నింటిని సాక్ష్యాధారాలతో రుజువు చేస్తానని ఆయన అన్నారు. మోడీ ప్రభుత్వం అసత్యాల ప్రచారాలతో ప్రజలను మభ్య పెట్టాలని చూస్తోందని అన్నారు.