గెలుపు ఓటమిల మ్యాచ్...నేడు కివీస్ తో రెండో టీ20

SMTV Desk 2019-02-08 09:44:13  India VS Newzeland, T20, BCCI, ICC, Indian Cricketers, krunal pandya, Khaleel ahmed, Westpac stadium, wellington, Akland, Eden park stadium

ఆక్లాండ్, ఫిబ్రవరి 08: నేడు ఆక్లాండ్ వేదికగా ఈడెన్ పార్క్ లో బారత్-న్యూజిలాండ్ ల మధ్య రెండో టీ20 జరగనుంది. బుదవారం జరిగిన మొదటి టీ20 లో ఊహించని విధంగా టీం ఇండియా పారజయ పాలైన సంగతి తెలిసిందే. అలాగే దానికి కారణంగా బీసీసీఐ కూడా తగిన చర్యలు తీసుకుంది. ఇక ఈ సిరీస్ ల విషయానికొస్తే 3 మ్యాచుల సిరీస్‌లో ఫస్ట్ టీ20లో ఘన విజయం సాధించిన న్యూజిలాండ్ ఎలాగైనా సిరీస్ నెగ్గేయాలనే ఆలోచనతో ఉంది. సిరీస్ మీద ఆశలు నిలవాలంటే ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సిన స్థితిలో రోహిత్ సేన ఉంది. న్యూజిలాండ్ టూర్ ముగియక ముందే కెప్టెన్ విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకోవడం టీమిండియాను కష్టాల్లోకి నెట్టేసింది అనే చెప్పాలి. కోహ్లీ లేకుండా ఆడిన నాలుగో వన్డేల్లో చిత్తుగా ఓడిన టీం ఇండియా చివరి వన్డేల్లో స్కోర్ చేయడానికి పోరాడాల్సి వచ్చింది. ఇక మొదటి టీ20 మ్యాచ్‌లో అయితే పరిస్థితి మరీ దారుణం.

జట్టులో 8మంది బ్యాట్స్‌మెన్లు ఉన్నా ఒక్కరంటే ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ చేయలేకపోయారు. ఫలితంగా టీ20ల్లోనే అతి పెద్ద ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. దీంతో రెండో టీ20 మ్యాచ్‌కి ముందు ఒత్తిడిలో పడింది రోహిత్ గ్యాంగ్. ముఖ్యంగా ముందుండి నడిపించాల్సిన బాధ్యత ఉన్న రోహిత్ నిర్లక్ష్యంగా ఆడుతూ వికెట్ చేజార్చుకుంటుండడం జట్టును ఆందోళనలోకి నెట్టేసింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నేడు రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. రెండో టీ 20 మ్యాచ్ కోసం భారత జట్టులో మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రత్యర్థి జట్టుకు ధారాళంగా పరుగులిచ్చిన ఖలీల్ అహ్మద్, కృనాల్ పాండ్యాలకు తుది టీమ్‌లో చోటు దక్కే అవకాశం దాదాపు ఉండకపోవచ్చు.

వీరి స్థానంలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ జట్టులోకి రావడం గ్యారెంటీ అని పలు వర్గాలు భావిస్తున్నారు. మిగిలిన స్థానంలో హైదరాబాద్ బౌలర్ సిరాజ్, సిద్ధార్థ్ కౌల్‌లలో ఎవరో ఒకరిని తీసుకోవాలని టీమిండియా కెప్టెన్ అనుకుంటున్నాడు. రోహిత్‌తో పాటు ఎప్పుడు ఆడతాడో, ఎప్పుడు అవుట్ అవుతాడో తెలియని మరో ఓపెనర్ శిఖర్ ధావన్ ఫామ్ కూడా టీమిండియాను కలవరపెడుతోంది. రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, హర్దిక్ పాండ్యా బ్యాటింగ్‌లో ఘోరంగా ఫెయిల్ అయ్యారు. రోహిత్ రాణించకపోయినా వీరు రాణిస్తే రెండో మ్యాచ్‌లో విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదు.

మొదటి టీ20 మ్యాచ్‌లో దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్, మహేంద్ర సింగ్ ధోనీ ముగ్గురు వికెట్ కీపర్లతో బరిలోకి దిగింది భారత జట్టు. వీరిలో దినేశ్ కార్తీక్ ఓ కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నా చేతుల్లోకి వచ్చిన రెండింటిని జారవిడిచాడు. కాబట్టి దినేష్ కార్తిక్‌కు చోటు దక్కుతుందా లేదా అనేది అనుమానంగా మారింది. మరోవైపు సీనియర్ బ్యాట్స్‌మెన్ గప్టిల్ గాయం కారణంగా సిరీస్‌కు దూరం కావడంతో జట్టులోకి వచ్చిన కివీస్ ఓపెనర్ టీమ్ సీఫర్ట్ అదరగొట్టాడు. 84 పరుగులు చేసి భారత బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. ఇతనితో పాటు మిగిలిన బ్యాట్స్‌మెన్ కూడా చెలరేగడంతో ఫస్ట్ మ్యాచ్‌లో భారీ స్కోరు సాధించింది. మొదటి మ్యాచ్ ఇచ్చిన ఉత్సాహం కారణంగా కూల్‌గా రెండో మ్యాచ్‌ను ముగించాలని భావిస్తోంది కివీస్ టీమ్.