ఈ ఏడాది ఎండలు మంటలే...చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం

SMTV Desk 2019-02-07 20:29:08  Summer Temperature, Pre Industrial Levels

బ్రిటన్, ఫిబ్రవరి 07: ఈ ఏడాది వేసవి కాలంలో ఎండలు మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. 2023 వరకు 150 ఏళ్లల్లో ఎప్పుడూ లేనంతగా అత్యధిక ఉష్టోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని బ్రిటన్ వాతారవణ శాఖ హెచ్చరించింది. ఈ సందర్భంగా రాబోయే ఐదేళ్లలో ఉష్ణోగ్రతల పరిస్థితులను వివరిస్తూ ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్ కన్నా 1డిగ్రీ సెంటిగ్రేడ్ అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు పేర్కొంది. ఇదివరకు 2015లో మొట్టమొదటిసారి ప్రీ ఇండస్ట్రీయల్ లెవెల్ కన్నా 1డిగ్రీ అధికంగా ప్రపంచ సగటు ఉష్ణోగ్రత పెరిగిందని గుర్తుచేసింది.

అప్పటి నుండే ఈ పరిస్థితి కొనసాగుతోందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ పెరుగుదల 1.5డిగ్రీల సెంటీగ్రేడ్ చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతాయని తెలిపింది. తాత్కాలికంగానే అయినా 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు పెరగనున్నట్లు తెలిపింది. ఉష్ణోగ్రతల నమోదు 1850 నుంచి మొదలైంది. 2018లో నమోదైన ఉష్ణోగ్రతలు నాలుగో అత్యధిక స్థాయి ఉష్ణోగ్రతలని వెల్లడైంది.